Gems And Jewellery Exports Have Continued The Downfall || రత్నాలు,నగల ఎగుమతుల్లో మందగమనం

2019-09-14 897

Gems and jewellery exports have continued the downward trend with a fall of 14 per cent in August 2019 to $2.84 billion against $3.32 billion in the same month, last year.Gem and jewellery experts say that the reason behind the fall is the hike in import duty on cut and polished diamond from 2.5 per cent to 7.5 per cent in the union budget.
#india
#jewellery
#gold
#diamonds
#polisheddiamond
#unionbudget
#Nirmalasitharaman

గత కొద్ది రోజులుగా ఆకాశాన్నంటిన పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఎగుమతుల విషయానికొస్తే రత్నాలు, నగలు ఎగుమతులు బేర్‌మంటున్నాయి. దాదాపు 14శాతం రత్నాలు మరియు బంగారు ఎగుమతులు ఆగష్టు నెలలో పడిపోయినట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. అంటే రత్నాలు మరియు నగల ఎగుమతులు 2.84 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే ఆగష్టు సమయానికి వాటి ఎగుమతులు 3.32 బిలియన్ డాలర్లుగా ఉన్నింది. రత్నాలు, నగల ఎగుమతులు పడిపోవడానికి కారణం పాలిష్డ్ వజ్రాల దిగుమతిపై అధిక సుంకం విధించడమే అని ఒకప్పుడు 2.5శాతంగా ఉన్న దిగుమతి సుంకం ఇప్పుడు 7.5శాతానికి పెంచుతూ ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ప్రభుత్వం ప్రకటించిందని చెబుతున్నారు రత్నాలు నగల నిపుణులు. విలువైన వజ్రాలను రౌండ్ ట్రిప్పింగ్ చేయడాన్ని అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్.. నీరవ్ మోడీ స్కామ్‌లో ఇదే జరిగిందని గుర్తుచేశారు.